W.G: భీమవరం ఆర్టీసీ డిపో మేనేజర్‌గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన వై.వేణును నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు శాలువ కప్పి, పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలియజేశారు. అనంతరం యూనియన్ కమిటీ సభ్యులను జిల్లా కార్యదర్శి వైవి రావు డిపో మేనేజర్‌కి పరిచయం చేశారు. కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకుని వెళ్లారు.