అన్నమయ్య: మదనపల్లెలో చెరువు కబ్జాపై రైతులు స్థానిక కలెక్టరేట్లో సోమవారం ప్రజాసమస్య పరిష్కార వేదికలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. చలపతి, కొంతమంది ఇతరులు వెళ్లే దారితో పాటు స్థానిక బడా బాబు ఓబులు నాయుని చెరువును పూడ్చి 10 ఎకరాలను కబ్జా చేసి దారిని మూసేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు కబ్జా రాయుడికి కొమ్ముకాస్తున్నట్లు రైతులు ఆరోపించారు.