AKP: ఈ నెల 13న అన్నదాతకు అండగా వైసీపీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పెందుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ తెలిపారు. బుధవారం రాంపురం పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశమై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేయడం జరుగుతుందన్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.