KKD: గత వైసీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాల పట్టాలను పేద ప్రజలకు ఇచ్చి, ఇళ్ల స్థలాలు చూపించకుండా మోసం చేసిందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు ఆరోపించారు. పిఠాపురంలోని జగ్గయ్యచెరువు, రదాల పేట, ఇందిరానగర్ ప్రాంతాల్లో ఆయన మంగళవారం పర్యటించారు. అనంతరం వైసీపీ ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల పట్టాలు పొందిన ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.