VZM: బొండపల్లి మండలం గొట్లాం జిల్లా పరిషత్ పాఠశాలలో పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 2 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు చేశామని మంత్రి వెల్లడించారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలను తప్పనిసరిగా వేయించాలన్నారు.