VSP: దేశ భద్రతా రహస్యాలను పాకిస్థాన్‌కు చేరవేసిన గూఢచర్య కేసులో మరో ఇద్దరు నేవీ అధికారులకు శుక్రవారం విశాఖ ప్రత్యేక న్యాయస్థానం ఐదేళ్ల పది మాసాల జైలు శిక్ష విధించింది. వీరు విశాఖ జిల్లాకు చెందిన కలవలపల్లి కొండబాబు, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన అవినాష్ సోమల్గా తెలిపారు. రూ. 5 వేలు చొప్పున జరిమానా కూడా విధిస్తూ తీర్పునిచ్చింది.