ATP: జిల్లా వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు 20 మండలాల పరిధిలో 1.1 మి.మీ సగటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. బొమ్మనహాళ్ 44.8 మి.మీ, కణేకల్లు 40, రాయదుర్గం 38.4 బెళుగుప్ప 36, వజ్రకరూరు 87.2, విడపనకల్లు 19.2, ఆత్మకూరు 18.2, నార్పల 10.6 మి.మీ వర్షం కురిసినట్లు పేర్కొన్నారు.