CTR: చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ శుక్రవారం బీసీ సంఘాల నాయకులతో కలిసి పీసీఆర్ కూడలిలోని మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అణగారిన వర్గాల ప్రజల కోసం, బాలికల విద్య, మహిళల హక్కుల కోసం జ్యోతిబాపూలే చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు.