ATP: ఆత్మకూరు మండలంలోని ప్రసిద్ధ పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధిలో మంగళవారం ఎస్పీ జగదీశ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ నిర్వాహకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సుబ్రమణ్య స్వామి ఆలయంలో ఎస్పీ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఆలయ ప్రతిష్ఠ గురించి అడిగి తెలుసుకున్నారు.