ATP: అనంతపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రెండు రోజుల పాటు జరిగిన ప్రాంతీయ క్రీడోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. సాంకేతిక విద్య డిప్యూటీ సెక్రెటరీ రమణ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. టేబుల్ టెన్నిస్, రిలే రేసుల్లో అనంతపురం ప్రథమ స్థానంలో నిలిచింది. బాలికల విభాగంలోనూ అనంతపురం విద్యార్థినులే ఛాంపియన్లుగా నిలిచారు.