ASR: డుంబ్రిగూడ మండలం గసబ పంచాయతీ మొర్రిగూడ, సిరసగూడ గ్రామాల్లో త్రాగునీటి ట్యాంక్‌ను సర్పంచ్ పాంగి సునీత మంగళవారం ప్రారంభించారు. పంచాయతి 15వ ఆర్థిక సంఘం నిధులతో రూ.8 లక్షల వ్యయంతో బోర్వెల్, త్రాగునీటి ట్యాంక్ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ.. సద్వినియోగం చేసుకోవాలని గిరిజనులకు సూచించారు.