కోనసీమ: ఈ నెల 21న అమలాపురంలోని హైస్కూల్ సెంటర్లో ఉన్న సంబర సెలబ్రేషన్ మీటింగ్ హాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వికాస మేనేజర్ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ.. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన అభ్యర్ధులు ఆరోజు ఉదయం 10 గంటలకు సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని సూచించారు.