ATP: రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వరుడు సోమవారం ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చాడు. స్వామివారికి పంచామృత, కుంకుమార్చనలు చేపట్టి స్వామి మూల విరాట్‌పై రుద్రాక్ష మాలలతో విశేషంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. సోమవారం రోజు స్వామివారిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని పురోహితులు రామకృష్ణ సూచించారు.