NLR: TIDCO ఇళ్ల కోసం బ్యాంకులో కట్టాల్సిన EMI బకాయిలు రూ.102 కోట్లు ప్రభుత్వమే చెల్లిస్తుందని TIDCO ఛైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ తెలిపారు. సోమవారం నెల్లూరు జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. బ్యాంకులకు చెల్లించాల్సిన EMIల బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుందన్నారు. TIDCO కాలనీలలో రేషన్ దుకాణాలు, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.