SKLM: ప్రభుత్వ రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలను నరసన్నపేట మండలం దేవాది గ్రామంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతుల కళ్ళల్లో వెలిగి నింపేందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.