అనంతపురం జిల్లా కంబదూరు మండలం గుళ్యం గ్రామంలో మంగళవారం రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళ్యాణదుర్గం ఆర్డీవో వసంత బాబు హాజరయ్యారు. ఆర్డిఓ మాట్లాడుతూ.. మండలంలోని ప్రజలు తమ భూసమస్యలను అర్జీల రూపంలో ఇస్తే వాటిని సంబంధిత అధికారులతో విచారణ జరిపి త్వరలోనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.