W.G: బీచ్ సమీపంలోని కొబ్బరితోటలో ఓ వృద్ధురాలి(65)పై అత్యాచారయత్నానికి పాల్పడిన యువకుడిని అరెస్టు చేసినట్లు మొగల్తూరు ఎస్ఐఐ వై. నాగలక్ష్మి తెలిపారు. గురువారం తోటలో పనులు చేసుకుంటున్న ఆమెపై పెద్దిరాజు దాడి చేయగా.. స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని నిన్న కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్ విధించినట్లు వెల్లడించారు.