PLD: దిడుగు గ్రామంలో శుక్రవారం 2 ప్రైవేటు బస్సులు ఢీకొని విద్యార్థులకు స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ఒక బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో ఎదురుగా వచ్చే మరో ప్రైవేటు స్కూలు బస్సుని ఢీ కొట్టిందన్నారు. ఫిట్నెస్లేని బస్సులను నడపడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. ప్రైవేటు బస్సుల ఫిట్నెస్ పై సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.