SS: జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ కొమ్ము సంపత్ కుమార్ కు చీఫ్ ఇంజినీర్ (సీఈ)గా పదోన్నతి లభించింది. సీఎండీ శివశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. కదిరి ప్రాంతానికి చెందిన సంపత్ కుమార్ తన ప్రాథమిక విద్య అక్కడే పూర్తి చేశారు. జిల్లాలో సమర్థవంతంగా సేవలందించిన ఆయనకు విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.