W.G: ఆకివీడులో బుధవారం డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు. ఆయన లబ్ధిదారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పెన్షన్‌తో పాటు వారికి చీరలు, పండ్లు కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఆర్డీవో రాహుల్ కుమార్ రెడ్డి, వార్డు కౌన్సిలర్ కిమిడి అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.