VZM: రాజాం మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు ఇవాళ స్దానిక శ్రీకృష్ణ నగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలోని ప్రతి వీధిలో తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీధిలైట్లు, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలని కోరగా అక్కడికక్కడే కమిషనర్ కొన్ని సమస్యలు పరిష్కరించారు. పారిశుద్ధ్య లోపాలు లేకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.