TPT: ఎర్రగడ్డ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర మార్కెటింగ్ శాఖ చర్యలు తీసుకుంది. తిరుపతిలోని రైతు బజార్లో కిలో ఎర్రగడ్డలు రూ.49కి అందించేందుకు చర్యలు చేపట్టింది. గురువారం ఉదయం 8 గంటలకు జేసీ ఈ కార్యక్రమం ప్రారంభిస్తారు. తిరుపతి రైతు బజారు 15 క్వింటాళ్ల ఎర్రగడ్డలు దిగుమతి చేసుకున్నారు. రద్దీ దృష్ట్యా ఒక్కరికి కిలో చొప్పున అందిస్తారు.