GNTR: సంగం డెయిరీ అభివృద్ధిలో సిబ్బంది పాత్ర మరువలేనిదని సంగం డెయిరీ ఛైర్మన్, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. చేబ్రోలు (M) వడ్లమూడిలోని సంగం డెయిరీలో శనివారం డీవీసీ అభయలో అంతర్భాగమైన సిబ్బంది పదవి విరమణ ప్రయోజన పథకంలో చేరి మరణించిన 57 మంది సభ్యులకు ఒక్కొక్కరికి రూ.25,000ల చొప్పున మొత్తం రూ.14,25,000లు వారి కుటుంబ సభ్యులకు చెక్కులు అందజేశారు.