తిరుపతి: రాష్ట్రంలో నెలకొన్న విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 25వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు నిరసనకు పిలుపునిస్తున్నట్లు ఎస్ఎఫ్ఎ జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. శనివారం ఎస్వీ యూనివర్సిటీ ప్రకాశం భవన్ ముందు విద్యారంగ సమస్యలపై ఎస్ఎఫ్ఎ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అక్బర్, రవి పోస్టర్ విడుదల చేశారు.