GNTR: మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ మృతి చెందడం పట్ల నేషనల్ నవక్రాంతి పార్టీ వ్యవస్థాపకులు కనకం శ్రీనివాసరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం మన్మోహన్ మృతిపై శ్రీనివాసరావు గురజాలలో మాట్లాడారు. రాజకీయాలలో మన్మోహన్ నిజాయితీ అందరికి స్ఫూర్తిదాయకమని అన్నారు. మన్మోహన్ కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.