SS: గాండ్లపెంట మండలం కటారుపల్లి యోగి వేమన ఆలయంలో ఈనెల 29 నుంచి వార్షిక తిరునాల ప్రారంభం కానుంది. వారం రోజులు నిర్వహించే ఈ ఉత్సవాల కోసం పీఠాధిపతి చెన్నారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం రాత్రి కుంభాభిషేకం, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ఉంటాయి. 30న పానక పందేరం, బండ్ల మెరవణి, 31న అగ్ని సేవ, ఏప్రిల్ 1న గొడుగుల మెరవణి నిర్వహిస్తారు.