NDL: చాగలమర్రి మండలంలోని బ్రాహ్మణపల్లెకు చెందిన కౌలు రైతు దాసరి సూరిబాబు 5 ఎకరాల పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం ప్రారంభించారు. మినుము పంట సాగు చేసి 70 రోజులైనా పూత రాకపోగా.. తెగులు సోకి పచ్చగా మారిపోయింది. వేల రూపాయలు వెచ్చించి రసాయన మందులు పిచికారి చేసినా తెగులు నివారణ కాలేదు. దీంతో చేసేదేం లేక రైతు పంటను దున్నివేశాడు.