అన్నమయ్య: సుండుపల్లెలోని ఆరెమ్మ ఆలయం వద్ద ఈ నెల 29న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త ఎర్రపురెడ్డి ఆరం రెడ్డి తెలిపారు. స్వర్గీయ ఎర్రపురెడ్డి సుబ్బారెడ్డి స్వర్గీయ లక్ష్మీదేవమ్మల జ్ఞాపకార్థం తిరుపతి అరవింద కంటి ఆసుపత్రి సహకారంతో ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైద్య శిబిరానికి వచ్చేవారు ఆధార్ కార్డు, సెల్ ఫోన్ తీసుకురావాలన్నారు.