అనకాపల్లి: జిల్లాకు మూడు అదనపు కోర్టులు మంజూరయ్యాయి. వీటిలో ఎలమంచిలిలో అదనపు సివిల్ జడ్జి కోర్టు, నర్సీపట్నంలో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు, అదనపు సివిల్ జడ్జి కోర్టులు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు ఈనెల 26న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ ఆమోదం తెలిపింది. హైకోర్టు ప్రతిపాదన మేరకు క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.