SKLM: బూర్జ మండలం వైకుంటపురం పంచాయతీ బొడ్డపాడు గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో పొలం కోసం తగువుపడిన వారిపై స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో మంగళవారం లక్ష రూపాయలు, బైండోవర్ చేసినట్లు ఎస్సై ప్రవల్లిక తెలిపారు. భవిష్యత్తులో ఎటువంటి గొడవలు పడకుండా వారిపై దృష్టి పెట్టడం కోసం బైండోవర్ కేసు నమోదు చేసినట్లు ఆమె స్పష్టం చేశారు.