VSP: ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్ర కేసరి సెమినార్ హాల్లో విద్యారంగ సమస్యలపై అవగాహన సదస్సు శనివారం జరిగింది. రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను, ఫీజ్ రీయింబర్స్మెంట్ బకాయిలను నిరసించారు. విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలో కొనసాగాలని ఏఐటీయూసీ నేత ఆదినారాయణ, ఏఐఎస్ఎఫ్ నాయకులు గుజ్జుల వలరాజు తదితరులు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.