తూ.గో: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించగా 28 ఫిర్యాదులను ప్రజల నుండి స్వీకరించారు. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్, అదనపు ఎస్పీలు ఎన్.బీ.ఎం మురళీకృష్ణ, ఏ.వీ సుబ్బరాజు ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు ఎస్పీ ఆదేశాలు ఇచ్చారు.