KRNL: ఎమ్మిగనూరులో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి బుధవారం ఉదయం సోమప్ప సర్కిల్లో ఉన్న అన్న క్యాంటీన్‌ను విస్తృతంగా పరిశీలించారు. క్యాంటీన్ సదుపాయాల గురించి సమాచారాన్ని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజూ సరైన సమయానికి ప్రజలకు భోజనం అందించాలంటూ సిబ్బందికి సూచనలిచ్చారు. ఇందులో భాగంగా అతని వెంట పలువురు అధికారులు ఉన్నారు.