ATP: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) వంద వసంతాల వేడుకల్లో భాగంగా రాయదుర్గం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే నేతలకు ఎప్పుడూ తన సహకారం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అధికారం కోసం కాకుండా ప్రజల కోసం కమ్యూనిస్టులు చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు.