SKLM: మందస పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రమాదకర కూడళ్ళలో శనివారం హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఎస్సై కె కృష్ణ ప్రసాద్ నేతృత్వంలో మండలంలోని ఉద్దాన ప్రాంతాలైన రట్టి, బేతాళపురం గ్రామ సమీపాన మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటిస్తూ, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఎస్సై అన్నారు.