ASR: జీ.మాడుగుల మండలంలోని కోడాపల్లి పంచాయతీ గన్నేరుపుట్టు గ్రామంలో 22 కేజీల గంజాయి పట్టుబడిందని సీఐ బీ.శ్రీనివాసరావు, ఎస్సై షణ్ముఖరావు మంగళవారం తెలిపారు. ముందస్తు సమాచారంతో తమ సిబ్బందితో కలిసి గ్రామంలో తనిఖీలు నిర్వహించగా మగు, జగదీశ్వరరావుకు చెందిన ఇంట్లో నిల్వ ఉంచిన గంజాయి పట్టుబడిందని చెప్పారు. ఈమేరకు గంజాయితో పాటు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.