NDL: శ్రీశైల భ్రమరాంబ దేవికి కృష్ణా జిల్లాకు చెందిన ఎం.రామచంద్రరావు కుటుంబసభ్యులు బంగారుపూత కలిగిన మకరతోరణాన్ని సమర్పించారు. 250 గ్రాముల బరువుగల ఈ మకరతోరణం విలువ సుమారు రూ. 24,45,000/- అని దాతలు పేర్కొన్నారు. మకరతోరణాన్ని దాతలు ఆలయ అధికారులకు నేరుగా అందజేశారు. దాత కుటుంబాన్ని స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేసి సత్కరించారు.