కృష్ణా: నందిగామ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏసీపి తిలక్ వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీబీ మాట్లాడుతూ.. ప్రజలందరూ సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండి మోసపోకుండా ఉండాలని, అలానే ప్రజలు ఏదైనా ఇబ్బంది కలిగి పోలీస్ స్టేషన్కిి వస్తే త్వరితగతిన సానుకూలంగా స్పందించి చట్టపరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని తెలియజేశారు.