W.G: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గోపాలపురంలో అందిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని స్కిల్ హబ్ కో-ఆర్డినేటర్ శ్రీనివాస్ సూచించారు. సోమవారం నుంచి ఈ శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. టెన్త్, ఆపై విద్యార్హతలు కలిగిన 18-35 వయస్సు కలిగి, ఆసక్తిగల వారు స్థానిక మండల పరిషత్ ఆఫీస్లో పేరు నమోదు చేసుకోవాలన్నారు.