PLD: ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో కొలువైన శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయంలో బుధవారం మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే జూలకంటి కుటుంబ సభ్యులను కమిటీ సభ్యులు సాదరంగా ఆహ్వానించారు. కుంకుమ పూజ కార్యక్రమాల అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను సత్కరించారు.