TPT: తిరుపతి నగర పాలక సంస్థ పరిధిలో కూరగాయలు, పళ్ళు, పూల వ్యాపారస్తులు తప్ప మరెవ్వరూ ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ గుత్తేదారునికి ఎటువంటి రుసుము చెల్లించ వద్దని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలో పలు వ్యాపారస్తుల వద్ద ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ గుత్తేదారుడు రుసుము వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు అందాయని తెలిపారు.