E.G: క్రిస్మస్ పండుగ అనేది లోకమంతా జరుపుకునే విశ్వ పండుగని రాజమండ్రి రూరల్ ఎమ్మార్వో పి. శ్రీనివాస్, తదితరులు అన్నారు. హుకుంపేట ఆదర్శనగర్లో మంగళవారం రాత్రి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో, సీఐలు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. లోక రక్షకుడైన ఏసుక్రీస్తు ప్రభువు చూపిన ప్రేమ మార్గంలో ప్రజలందరూ నడవాలన్నారు.