అనంతపురం రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని సరస్వతి విద్యానికేతన్ పాఠశాలలో శక్తి యాప్‌పై పోలీసులు అవగాహన కల్పించారు. ఈ యాప్ మహిళల భద్రత కోసం రూపొందించబడిందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసు రక్షణ అవసరమైనప్పుడు సహాయపడుతుందని అన్నారు. యాప్‌లోని SOS బటన్ ప్రెస్ చేస్తే లొకేషన్ ఆధారంగా 10 నిమిషాల్లో పోలీసులు బాధితుల వద్దకు చేరుకుంటారని తెలిపారు.