MDK: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నార్సింగి మండల కేంద్రంతో పాటు నర్సంపల్లి గ్రామంలో శుక్రవారం పర్యటించనున్నట్లు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలారం బాబు తెలిపారు. నర్సంపల్లి గ్రామంలో పెద్దమ్మ ఆలయంలో జరిగే అమ్మవారి కళ్యాణోత్సవంలో పాల్గొననున్నట్లు తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.