NTR: నందిగామలోని వై. జంక్షన్ వద్ద రాత్రి ఏసీపీ తిలక్ ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వాహనాలను పరిశీలించి, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న పలువురికి జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో నందిగామ సీఐ వైవిఎల్ నాయుడు, ఎస్సై అభిమన్యు, ట్రాఫిక్ ఎస్సై నరేశ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.