ATP: వైసీపీ ప్రభుత్వం నీటిపారుదల రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు జీవనాడి అయిన హెచ్చెల్సీకి పైసా కూడా విడుదల చేయలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అత్యవసర మరమ్మతులకు రూ.28.05 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు.