E.G: తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామస్థులు ఇంటి, కుళాయి పన్నులను ‘స్వర్ణ పంచాయతీ’ పోర్టల్ ద్వారా డిజిటల్ పద్ధతిలో చెల్లించాలని పంచాయతీ కార్యదర్శి కె. కామేశ్వరి బుధవారం కోరారు. ఆన్లైన్ చెల్లింపులతో పారదర్శకత పెరిగి, సిబ్బంది పనిభారం తగ్గుతుందని తెలిపారు. ప్రజలకు డిజిటల్ చెల్లింపులపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని ఆమె పేర్కొన్నారు.