VZM: శృంగవరపుకోట మండలం పెదఖండేపల్లి గ్రామంలో ఆదివారం ఉదయం నుంచి పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గతవారం రోజుల నుంచి కురిసిన వర్షాలకు రోడ్లపై అధిక మోతాదులో చేరిన చెత్త, వ్యర్థాలను కాలువల్లో ఉన్నచెత్తను పారిశుద్ధ్య కార్మికులు తొలగిస్తున్నారు. వర్షపు నీరు కలుషితం అయ్యి సీజనల్ వ్యాధులు, జ్వరాల బారిన పడే అవకాశం ఉన్నందున ఈ పనులను మొదలుపెట్టారు.