BPT: పట్టణంలో వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. బాపట్ల మార్కెట్ వద్ద షేక్ నాయబ్ రసూల్(44) అనే వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పట్టణ సీఐ అహ్మద్ జానీ మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.