CTR: పుత్తూరు మున్సిపాలిటీ తిమ్మాపురం శ్రీశ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ కృష్ణ స్వామి వారి దేవాలయంలో సోమవారం కుంభాభిషేక మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ హాజరయ్యారు. ఆయన ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.